ధరణితో పారదర్శక సేవలు
ABN , First Publish Date - 2020-11-26T05:32:10+05:30 IST
ధరణితో పారదర్శక సేవలు

- చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు
- షాబాద్: ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు అన్నారు. బుధవారం షాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. భూములు రిజిస్ర్టేషన్ సమయంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా? అని తహసీల్దార్ అమర లింగంగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... ధరణితో భూమి కొనుగోలుదారులు, అమ్మకందారులు రెవెన్యూ శాఖ నుంచి సత్వర సేవలు పొందుతున్నారని తెలిపారు. వ్యవసాయ భూములు రిజిస్ర్టేషన్ చేసుకునేముందు మీ సేవ కేంద్రాల్లోగానీ, స్మార్ట్‌ఫోన్ల నుంచి గానీ స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ కార్తీక్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మహేందర్‌గౌడ్ సిబ్బంది ఉన్నారు.