అభివృద్ధి పనులు వేగిరం చేయాలి

ABN , First Publish Date - 2020-09-01T08:31:46+05:30 IST

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ధర్మాపూర్‌,

అభివృద్ధి పనులు వేగిరం చేయాలి

కొడంగల్‌: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ధర్మాపూర్‌, లక్ష్మీపల్లి, అప్పాయిపల్లి గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీపల్లి, ప్యాలమద్ది, చిన్ననందిగామ గ్రామాల్లో దసరా నాటికి బీటీరోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట రాంరెడ్డి, నాగరాణి, సర్పంచ్‌లు, ఎస్‌బీ.సుజాత, రాములు పాల్గొన్నారు. హస్నాబాద్‌ గ్రామంలో గణనాథులకు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ నాగరాణి తదితరులు పూజలు చేశారు.  


Updated Date - 2020-09-01T08:31:46+05:30 IST