రాజకీయాలకతీతంగా మండలాభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-30T04:07:38+05:30 IST
రాజకీయాలకతీతంగా మండలాభివృద్ధి
మహేశ్వరం: రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నట్టు ఎంపీపీ కె.రఘుమారెడ్డి తెలిపారు. మంగళవారం మహేశ్వరంలో రూ.6లక్షలతో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించారు. మాట్లాడుతూ మహేశ్వరంలో దశాబ్దాలుగా పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని, వారికి ఇబ్బంది కలగకుండా టాయ్‌లెట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.నర్సింహులు, వైస్‌ఎంపీపీ ఆర్.సునీతఅంద్యానాయక్, ఎంపీటీసీ సుదర్శన్‌యాదవ్, ఉపసర్పంచ్ దోమ శ్రీనివా్‌సరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు కె.చంద్రయ్య, ఎం.నవీన్, నర్సింహ, రాఘవేందర్, కె.శ్రీను పాల్గొన్నారు.