అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2020-12-12T04:59:08+05:30 IST

అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
కమ్మనాచారంలో శ్మశానవాటికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

దోమ: శ్మశాన వాటికల నిర్మాణాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కమ్మనాచారం గ్రామంలో శ్మశాన వాటికను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డు, వర్మీకంపోస్ట్‌, రైతువేదిక నిర్మాణాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్‌ నర్సమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రమేశ్‌, శాంతుకుమార్‌, యాదయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:59:08+05:30 IST