అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-23T06:13:18+05:30 IST

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని కౌంకుట్ల గ్రామానికి చెందిన...

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

చేవెళ్ల: అప్పుల బాధతో  కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది.  చేవెళ్ల మండల పరిధిలోని కౌంకుట్ల గ్రామానికి చెందిన కడుమురి వెంకటయ్య(53) సొంతంగా  పొలం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన సాలే బాబుకు చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని అందులో పత్తిపంట సాగు చేశాడు. పంట ఏపుగా పెరిగినా దిగుబడి ఆశించిన మేరకు రాలేదు. సాగు పెట్టుబడి కోసం,  రెండేళ్ల క్రితం కూతురి వివాహం కోసం  మొత్తం రూ.3లక్షల వరకు అప్పులు చేశాడు.


  అయితే పత్తి పంట దిగుబడి రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంట్లోనే పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆస్ప్రతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన తమను ప్రభుత్వం  ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. 

Updated Date - 2020-03-23T06:13:18+05:30 IST