రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2020-12-12T05:00:38+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మంచాల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మంచాల పోలీ్‌సస్టేషన్ పరిది ఆగాపల్లి సాగర్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చండూర్ మండలం జోగుగూడకు చెందిన ఒట్టి నారయ్య(45), కుమారుడు శ్రీకాంత్, అన్న సత్తయ్యతో కలిసి బైక్‌పై నగరంలో బంధువుల వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆగాపల్లి సమీపం వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో నారయ్య అక్కడికక్కడే మృతిచెందగా శ్రీకాంత్, సత్తయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.