ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న డీసీఎం

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

ఉల్లి లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న డీసీఎం

ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు 


శంషాబాద్‌రూరల్‌ : ఉల్లి లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 4గంటలకు శంషాబాద్‌ రూరల్‌ పరిధిలోని కిషన్‌గూడ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ కర్నూల్‌ జిల్లా గూడూర్‌కు చెందిన అంజనేయులు(35) డీసీఎంలో ఉల్లిలోడ్‌తో హైదరాబాద్‌ వస్తున్నాడు. మార్గమధ్యలో శంషాబాద్‌ కిషన్‌గూడ వద్ద ముందువెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ సడెన్‌బ్రేక్‌ వేయడంతో వెనకాలే వున్న డీసీఎం ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు.


డీసీఎం డ్రైవర్‌ పిడుగు మధు, మృతుడి బంధువులు మధుసూదన్‌, తెలుగుశివ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సంఘటనా స్థలం నుంచి ఆయిల్‌ట్యాంకర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. గమనించిన వాహనాదారులు పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను లిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్‌ మధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెద్యులు తెలిపారు.


ఆంజనేయులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుజాత, కొడుకు, కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ ఎస్సై సుదర్శన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST