-
-
Home » Telangana » Rangareddy » Dattatreya who consulted Prasad Kumar
-
ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించిన దత్తాత్రేయ
ABN , First Publish Date - 2020-12-31T05:11:35+05:30 IST
ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించిన దత్తాత్రేయ

వికారాబాద్ : మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ సతీమణి శైలజ ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి బి.జనార్థన్ బుధవారం ప్రసాద్‌కుమార్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆమె మరణానికి గల కారణాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. శైలజ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ప్రసాద్‌కుమార్‌కు గుండె ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరారు. కాగా ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రసాద్‌ను పరామర్శించారు.