ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

ABN , First Publish Date - 2020-10-28T10:15:43+05:30 IST

మండలపరిధిలోని మందిపాల్‌ గ్రామంలో విద్యుత్‌వైర్లు ప్రమాదకరంగా మారాయి. ఇళ్లపై నుంచి విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయి.

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

కులకచర్ల: మండలపరిధిలోని మందిపాల్‌ గ్రామంలో విద్యుత్‌వైర్లు ప్రమాదకరంగా మారాయి. ఇళ్లపై నుంచి విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయి. సరిచేయాలని సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన బాధితురాలు లక్ష్మమ్మ తెలిపారు. గ్రామ పరిధిలో చాలా మంది ఇళ్లపై నుంచి విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయి. ఇంటి పైకి వెళ్లడానికి భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరుగకముందే విద్యుత్‌ వైర్లను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2020-10-28T10:15:43+05:30 IST