స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు కృషి

ABN , First Publish Date - 2020-12-05T05:55:17+05:30 IST

స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు కృషి

స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు కృషి
పారిశుధ్య సిబ్బందిని సన్మానిస్తున్న దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

కీసర రూరల్‌: స్వచ్ఛ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీతలు అన్నారు. శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. విధుల పట్ల నిబద్దతతో పని చేసిన వారిని గుర్తించి సన్మానించారు. ఆనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు చైర్మన్లు మాట్లాడుతూ మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు పురపాలక ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్లు మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మల్లే్‌షయాదవ్‌, కమిషన్లు వాణి, స్వామి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:55:17+05:30 IST