-
-
Home » Telangana » Rangareddy » damaged roads seen by congress leaders
-
రోడ్ల అభివృద్ధి పట్టని ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-28T05:21:40+05:30 IST
రోడ్ల అభివృద్ధి పట్టని ప్రభుత్వం

- కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్
చౌదరిగూడ: గోతులమయమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండలం పద్మారం రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడ చూసినా కంకర తేలిన, బీటీ లేచిన రోడ్లే కనిపిస్తున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ నాయకులు మాటలకే పరిమితమయ్యారు తప్పితే పనులు చేయడంలేదన్నారు. కొందుర్గు మండలం వెనికిరాల నుంచి కాస్లాబాద్ మీదుగా ముష్టిపల్లి వరకు మంజూరైన బీటీ రోడ్డు, పద్మారం రోడ్డు పనులను నిలిపివేశారన్నారు. లాల్‌పహడ్-చలివేద్రంపల్లి రోడ్డుకు పదేళ్లుగా బీటీ వేయలేదన్నారు. మండల కార్యాలయాలు నిర్మంచలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జితేందర్‌రెడ్డి, బంద్యయ్య, చిల్ల రాజు, నర్సింలు, అశోక్, వేణుగోపాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.