విండో మాజీ చైర్మన్‌పై దాడి

ABN , First Publish Date - 2020-12-04T05:02:49+05:30 IST

విండో మాజీ చైర్మన్‌పై దాడి

విండో మాజీ చైర్మన్‌పై దాడి
గాయపడిన శంకర్‌

కేశంపేట: కేశంపేట మండలం కొత్తపేట సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు టి.శంకర్‌పై కొందరు వ్యక్తులు గురువారం దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళితే... కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ చైర్మన్‌ టి.శంకర్‌కు గ్రామ సమీపంలో పొలం ఉంది. దానిలో బోరు కూడా ఉంది. శంకర్‌ పొలం పక్కనే అదే గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌ అనే వ్యక్తి పొలం ఉంది. బాల్‌రాజ్‌ వాల్టా చట్టానికి విరుద్ధంగా శంకర్‌ బోరు పక్కనే కొత్తగా బోరు వేశాడు. దీంతో బోరుకు కనీసం దూరం పాటించకుండా ఎందుకు బోరు వేస్తున్నావంటూ శంకర్‌ అతడిని ప్రశ్నించడంతో పాటు తహసీల్దార్‌కు గురువారం ఫిర్యాదు చేశాడు. దీంతో శంకర్‌పై కక్షగట్టిన బాల్‌రాజ్‌ తన కుమారులు, మరికొందరు అనుచరులతో కలిసి శంకర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శంకర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2020-12-04T05:02:49+05:30 IST