దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేలా చట్టాలు
ABN , First Publish Date - 2020-12-31T04:55:31+05:30 IST
దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేలా చట్టాలు
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో జాగరణ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలని, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేవిగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాలపట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిపోయి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు భాస్కర్, ఉపాధ్యక్షుడు జగదీష్, మండల కన్వీనర్ బుగ్గరాములు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సామేల్ తదితరులున్నారు.