ఢిల్లీలో మృతిచెందిన రైతులకు నివాళి
ABN , First Publish Date - 2020-12-21T04:22:47+05:30 IST
ఢిల్లీలో మృతిచెందిన రైతులకు నివాళి

ఘట్‌కేసర్: దేశరాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలో అసువులు బాసిన అన్నదాతలకు ఘట్‌కేసర్ మండల సీపీఐ కార్యదర్శి లొట్టి ఈశ్వర్ ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మున్సిపాలిటీలోని కేఎల్ మహేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రైతులను ముంచేందుకు కొత్త చట్టాలకు శ్రీకారం చుట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు క్షమాపన చెప్పి ఆందోళన విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి దండాలు పెట్టివచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్కడి రైతుల ఆందోళన కనిపించకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో జయచంద్ర, అన్వర్ పాషా, సదాశివ, యాదయ్య, సరిత, ప్రభావతి, తిరుపతిరెడ్డి, కిష్టయ్య, రామచంద్రం పాల్గొన్నారు.