పోరాటాలతోనే దోపిడీకి అడ్డుకట్ట

ABN , First Publish Date - 2020-12-27T05:35:38+05:30 IST

పోరాటాలతోనే దోపిడీకి అడ్డుకట్ట

పోరాటాలతోనే దోపిడీకి అడ్డుకట్ట
జెండాను ఆవిష్కరించి మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు

  • సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు 
  • ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

షాద్‌నగర్‌ అర్బన్‌/కొత్తూర్‌: నిరంతర పోరాటాలతోనే దోపిడీని అరికట్టవచ్చని సీపీఐ నిరూపించిందని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు. సీపీఐ 95వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం షాద్‌నగర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్‌ 26న కాన్పూర్‌లో అవిర్భవించిన సీపీఐ దోపిడీ వ్యవస్థపై పోరాటాలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జంగయ్య, చంద్రబాబు, విఠల్‌యాదవ్‌, లింగంనాయక్‌ పాల్గొన్నారు. కొత్తూర్‌ మండలంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.నర్సింహారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారంలో సీపీఐ ఎన్నో ఉద్యమాలు చేసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎండీ షకీల్‌, శేఖర్‌రెడ్డి, మాధవరెడ్డి, హుస్సేన్‌, అస్ఫరబేగం, మున్సిపల్‌ కార్మికులు సంజీవ, జంగయ్య పాల్గొన్నారు. 


ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

చేవెళ్ల/షాబాద్‌/మొయినాబాద్‌/శంకర్‌పల్లి/శంషాబాద్‌: పేదలకు అన్ని విధాల సీపీఐ అండగా ఉంటుందని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి, చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌గౌడ్‌ అన్నారు. 95వ ఆవిర్భావోత్సవాల్లో భాగంగా చేవెళ్లలో జెండాను ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ చారి, మండల రైతు సంఘం అధ్యక్షుడు సత్తిరెడ్డి, నాయకులు ఎండీ మక్బూల్‌, కృష్ణ, పెంటయ్య, అప్జల్‌, అంజయ్య, రాములమ్మ, మైసమ్మ, చంద్రయ్య పాల్గొన్నారు. సీపీఐ ప్రజల పక్షానపోరాడుతూనే ఉంటుందని పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. షాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లోని కుర్వగూడ, షాబాద్‌, మొయినాబాద్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రభులింగం, షాబాద్‌, మొయినాబాద్‌ మండలాల కార్యదర్శులు నక్కలి జంగయ్య, శ్రీనివాస్‌, సహాయకార్యదర్శి రఘురాం, నాయకులు రుక్కయ్య, మధు, నారాయణ పాల్గొన్నారు. బడుగుల సంక్షేమానికి సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని పార్టీ శంకర్‌పల్లి మండల కార్యదర్శి సుధీర్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం టంగుటూరులో సీపీఐ జెండావిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో బిక్షపతి, షాబుద్దీన్‌, మాణెయ్య తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో సీపీఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి గిరి పార్టీ జెండాను ఆవిష్కరించారు.  


హక్కుల సాధనకు పోరాటం

ఇబ్రహీంపట్నం: పేద ప్రజల హక్కుల సాధన కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని పార్టీ రాష్ట్ర నాయకుడు కావలి నర్సింహ అన్నారు. సీపీఐ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సీపీఐ వీరోచిత పాత్ర పోషించిందని గుర్తుచేశారు. బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరుసల్పిందన్నారు. సీఎం కేసీఆర్‌ హామీలు నీటి మూటలుగానే మిగిలాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ములుగు నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు శివరాల లక్ష్మయ్య,, అంజయ్య, యాదగిరి, అశోక్‌, శ్రీను, పాండు తదితరులున్నారు.

Updated Date - 2020-12-27T05:35:38+05:30 IST