-
-
Home » Telangana » Rangareddy » Counselor campaign for corona building
-
కరోనా కట్టడికి కౌన్సిలర్ ప్రచారం
ABN , First Publish Date - 2020-03-25T11:54:16+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి కోసం ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఇంట్లోనే ఉండాలని కోరుతూ...

షాద్‌నగర్‌అర్బన్: కరోనా వైరస్ కట్టడికి కోసం ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఇంట్లోనే ఉండాలని కోరుతూ 7వ వార్డు కౌన్సిలర్ ఈశ్వర్‌రాజు, సామాజిక వేత్త వంగూరి గంగిరెడ్డిలు ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఈశ్వర్‌రాజు తన కారులో లౌడ్‌స్పీకర్‌ను ఏర్పాటు చేసి, 7వ వార్డులోని కాలనీల్లో ప్రచారం చేశారు. ప్రాణాంతకమైన కరోనా వైర్‌సకు మందులేదని, ఇప్పటికే ప్రపంచదేశాల్లో తీవ్ర బీభత్సం సృష్టించిన కరోనాను కట్టడి చేయడానికి ఏ ఒక్కరూ కూడా ఇళ్లు వదలి బయటకు రావద్దని గంగిరెడ్డి కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఇలా ప్రతి వార్డులో కౌన్సిలర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి, కరోనా వైరస్ కట్టడి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.