పత్తిరైతుల పడిగాపులు

ABN , First Publish Date - 2020-12-31T04:59:09+05:30 IST

పత్తిరైతుల పడిగాపులు

పత్తిరైతుల పడిగాపులు
మిల్లులోకి వెళ్లడానికి గొడవ పడుతున్న రైతులు

షాద్‌నగర్‌అర్బన్‌: ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించుకోవడానికి కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి జిన్నింగ్‌ మిల్లుల ఎదుట రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేశంపేట మండలంలోని వేములనర్వ గ్రామ శివారులోని జిన్నింగ్‌ మిల్లులోని కొనుగోలు కేంద్రానికి రైతులు ట్రాక్టర్లలో పత్తిని తీసుకొస్తున్నారు. అదే మిల్లుకు పత్తి వ్యాపారులు సైతం వస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారానికి ఐదు రోజులు మాత్రమే జిన్నింగ్‌ చేస్తున్న మిల్లు వద్ద బుధవారం వందలాది పత్తి వాహనాలు నిలిచి ఉన్నాయి. మూడు, నాలుగు రోజుల క్రితం వచ్చిన వాహనాలు కూడా ఉండటం గమనార్హం. మిల్లు నిర్వాహకులు, పత్తి వ్యాపారులు, సీసీఐ కొనుగోలు అధికారులు కుమ్ముక్కై పత్తిని తెస్తున్న వ్యాపారుల లారీలను ఖాళీ చేయడానికే అధిక ప్రాధాన్యతనిస్తూ, తమ ట్రాక్టర్ల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. జనవరి ఒకటితో పాటు శని, ఆదివారాలు సెలవులు కావడంతో మరెన్ని రోజులు నిరీక్షించాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.   

Updated Date - 2020-12-31T04:59:09+05:30 IST