కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2020-03-16T06:24:28+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ అన్నారు. వైద్య బృందం, జీఎంఆర్‌ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, స్ధానిక పోలీసులు డీసీపీ, ఏసీపీతో కలిసి కమిషనర్‌ శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

ఎయిర్‌పోర్టులో 64వేల మందికి ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్టులు

ప్రజలు భయపడ్సాలిన అవసరం లేదు

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ 

ఎయిర్‌పోర్డులో థర్మల్‌ స్ర్కీనింగ్‌ 

సెంటర్‌ను పరిశీలించిన సీపీ


శంషాబాద్‌ రూరల్‌: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సైబరాబాద్‌ కమిషనర్‌  సజ్జనార్‌ అన్నారు. వైద్య బృందం, జీఎంఆర్‌ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, స్ధానిక పోలీసులు డీసీపీ, ఏసీపీతో కలిసి కమిషనర్‌ శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి ఎయిర్‌పోర్టులో ఇప్పటి వరకు 64వేల మంది ప్రయాణికులకు స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహించారని తెలిపారు. 200 మంది డాక్టర్లతో 24 గంటల పాటు స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తోందన్నారు. అలాగే  స్ర్కీనింగ్‌లో కరోనా ఉన్నట్లు తేలితే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా మనదేశం వైరస్‌ కాదని ఇది ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వస్తోందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వారిని వెంటనే గాంధీకి ఐసోలేషన్‌ తరలిస్తున్నామని తెలిపారు.


అదేవిధంగా వారి నుంచి రక్త నమునాలు సేకరించి పరీక్షల నిమిత్తం పుణేకు పంపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా చైనా, జర్మన్‌, స్పెయిన్‌, ఇటలీ, వూహాన్‌, ఫ్రాన్స్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు దగ్గు, జ్వరం, జలుబు ఉంటే వారిని ఆస్పత్రులకు పంపించి రక్త నమూనాలను సేకరించి రిపోర్టులు వచ్చిన తరువాత కరోనా లేదని తేలితేనే వారిని ఇంటికి పంపిస్తున్నామని సీపీ తెలిపారు. అదేవిధంగా సినిమా హాల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలు  31 వరకు  మూసివేయాలన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వారికి వ్యక్తి గత రక్షణ కిట్టు అందజే స్తున్నామని తెలిపారు. ఆయన వెంట శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్‌, సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, తదితరులున్నారు. 

Updated Date - 2020-03-16T06:24:28+05:30 IST