భయం.. భయం!

ABN , First Publish Date - 2020-07-14T10:11:03+05:30 IST

కరోనా కోరలు చాస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 362 మంది వైరస్‌ బారిన పడ్డారు. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 189

భయం.. భయం!

ఒక్కరోజే 362 మందికి కరోనా

అత్యధికంగా మేడ్చల్‌లో 189, రంగారెడ్డిలో 170, వికారాబాద్‌లో ముగ్గురికి 

ఉమ్మడి జిల్లాలో  6,464కు చేరుకున్న బాధితులు   


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)/ (ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా కోరలు చాస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 362 మంది వైరస్‌ బారిన పడ్డారు. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 189 మందికి పాజిటివ్‌గా తేలింది. రంగారెడ్డి జిల్లాలో 170 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వికారాబాద్‌ జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 6,464కు చేరుకుంది.  


జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికం

రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 107 కేసులు నమోదయ్యాయి. సరూర్‌నగర్‌లో 23, శేరిలింగంపల్లిలో 42, మైలార్‌దేవ్‌పల్లిలో 31, అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 11 కేసులు నమోదయ్యాయి. 


నాన్‌జీహెచ్‌ఎంసీలో..

రంగారెడ్డి జిల్లా నాన్‌జీహెచ్‌ఎంసీలో 63 కేసులు నమోదయ్యాయి. బాలాపూర్‌లో 13, దుబ్బచర్లలో 2, తలకొండపల్లిలో ఒకరు, నర్కొడలో 4, నార్సింగిలో 22, పెద్దషాపూర్‌లో 5, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో ఇద్దరు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. చించోడులో నలుగురు, ఇబ్రహీంపట్నంలో ముగ్గురు, దండుమైలారంలో ఒకరు, అబ్ధుల్లాపూర్‌మెట్‌లో నలుగురికి వైరస్‌ సోకినట్లు అధికారులు తేల్చారు. 


మేడ్చల్‌ జిల్లాలో గత రెండురోజుల్లో 429 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం 189 కేసులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు పెరిగాయి. జిల్లాలో గర్భిణులకు 10రోజుల ముందుగానే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3242పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 28మంది మృతి చెందారు. 1443 యాక్టివ్‌ కేసుల్లో ఆస్పత్రి ఐసోలేషన్‌లో 259 మంది ఉండగా, హోం ఐసోలేషన్‌లో 1184 మంది ఉన్నారు. మొత్తం 3242 కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2713 ఉండగా, మునిసిపాలిటీల్లో 477, గ్రామీణప్రాంతాల్లో 52 ఉన్నాయి. 

Updated Date - 2020-07-14T10:11:03+05:30 IST