స్వీయ నియంత్రణతోనే కరోనా ఖతం
ABN , First Publish Date - 2020-05-17T09:29:07+05:30 IST
స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని నియంత్రిచొచ్చని కా

కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసర రూరల్ : స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని నియంత్రిచొచ్చని కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీ గాంధీనగర్‌లోని మానస వృద్ధాశ్రమంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలను ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో వలస కూలీలు, నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పేదలకు ఆపన్నహస్తం అందించేందుకు దాతలు ముందుకు రావటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, చైర్పర్సన్ వసుపతి ప్రణీత, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గౌతమ్‌కుమార్, తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ వాణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.