స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యం

ABN , First Publish Date - 2020-07-22T10:14:58+05:30 IST

స్వీయ నిర్భంధంతోనే కరోనా కట్టడి సాధ్యమని వికారాబాద్‌ సీఐ శ్రీనివా్‌సరావు అన్నారు.

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యం

వికారాబాద్‌ : స్వీయ నిర్భంధంతోనే కరోనా కట్టడి సాధ్యమని వికారాబాద్‌ సీఐ శ్రీనివా్‌సరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని బీజేఆర్‌, ఎన్టీఆర్‌ చౌరస్తాలో పోలీస్‌ సిబ్బందితో కలిసి వాహనదారులు, పట్టణవాసులకు కరోనా నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణ ప్రజలు రోడ్లపై తిరగకుండా ఇళ్ల వద్దే ఉండి స్వీయనిర్భంధం పాటించాలని హితవు పలికారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఇంకా ఎస్‌ఐ లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-22T10:14:58+05:30 IST