కలెక్టరేట్‌లో కరోనా కాల్‌సెంటర్‌

ABN , First Publish Date - 2020-03-21T06:07:48+05:30 IST

కరోనాపై ప్రజల అనుమానాలు తీర్చడం, సమాచారం సేకరించేందుకు అనువుగా శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ను కలెక్టర్‌

కలెక్టరేట్‌లో కరోనా కాల్‌సెంటర్‌

మేడ్చల్‌ అర్బన్‌: కరోనాపై ప్రజల అనుమానాలు తీర్చడం, సమాచారం సేకరించేందుకు అనువుగా శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ను కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేసి, విధులను వేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ రాంచందర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌ విధుల్లో ఉంటారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ శెర్పాల్‌ నాయుడు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రవీణ్‌, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ సంతో్‌షకుమార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రదీప్‌ విధులు నిర్వహించనున్నారు. కరోనాపై ఎటవంటి సమాచారమైనా హెల్ప్‌ లైన్‌ నెంబరు 9492409781కు ఫోన్‌ చేసి తెలపాలని కలెక్టర్‌ ప్రజలకు సూచించారు. 

Updated Date - 2020-03-21T06:07:48+05:30 IST