-
-
Home » Telangana » Rangareddy » Corona
-
మృత్యు భయం
ABN , First Publish Date - 2020-11-25T05:34:45+05:30 IST
మృత్యు భయం

- మంగళవారం కరోనాతో ఇద్దరి మృతి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): రంగారెడ్డి జిల్లాలో కరోనా మృత్యు భయం వెంటాడుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 341కి చేరుకుంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 189 కాగా వికారాబాద్ జిల్లాలో 54, మేడ్చల్ జిల్లాలో 98కి చేరుకున్నాయి. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో మంగళవారం 389 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 215 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 162, వికారాబాద్ జిల్లాలో 12నమోదయ్యాయి.
షాద్‌నగర్ డివిజన్‌లో ఐదుగురికి..
షాద్‌నగర్ డివిజన్‌లో మంగళవారం ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిలో ముగ్గురు షాద్‌నగర్‌కు చెందినవారు కాగా ఇద్దరు కేశంపేట మండలవాసులు.
వికారాబాద్ జిల్లాలో 12మందికి
వికారాబాద్ జిల్లాలో మంగళవారం 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 10మంది. తాండూరు, కోట్‌పల్లిలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
చేవెళ్ల డివిజన్‌లో ముగ్గురికి..
చేవెళ్ల డివిజన్ పరిధిలో మంగళవారం ముగ్గురికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. వైరస్ సోకిన వారిలో చేవెళ్లలో ఒకరు, శంకరిపల్లిలో ఇద్దరు ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ముగ్గురికి..
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో మంగళవారం 11 కేంద్రాలతో పాటు రెండు మొబైల్ టీంల ద్వారా 353 మందికి కరోనా యాంటీజెన్ టెస్టులు నిర్వహించారు. అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడిన వారిలో దండుమైలారం, రాగన్నగూడ, హయత్‌నగర్‌లలో ఒక్కొక్కరు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఆమనగల్లులో రెండు..
ఆమనగల్లు, కడ్తాల, వెల్దండ మండలాల పరిధిలోని 52 మందికి మంగళవారం డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
మేడ్చల్‌లో ఆరుగురికి..
మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం 81 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా పాజివివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని వైద్యురాలు నళిని తెలిపారు.
శంషాబాద్‌లో ఒకరికి..
శంషాబాద్ మున్సిపాలిటీలో మంగళవారం ఒకరికి కరోనా సోకినట్టు డాక్టర్లు తెలిపారు. మొత్తం 53మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.