వెంటాడుతున్న కరోనా రక్కసి
ABN , First Publish Date - 2020-09-18T06:23:06+05:30 IST
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 960 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 481 కేసులు నమోదు కాగా, ముగ్గురు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 960 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 481 కేసులు నమోదు కాగా, ముగ్గురు వైరస్‌కు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో 448, వికారాబాద్ జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో..
ఇబ్రహీంపట్నం / శంషాబాద్ / ఆమనగల్లు/ కందు కూరు/ చేవెళ్ల / షాద్‌నగర్ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గురువారం 287 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 39 మందికి పాజిటివ్ వచ్చింది. శంషాబాద్‌లో 67 మందికి కరోనా పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 42మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 54మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. చేవెళ్ల డివిజన్ పరిధిలో కరోనా వైద్యపరీక్షలు 181 మందికి చేయగా ఇందులో 17 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యధికారులు తెలిపారు. షాద్‌నగర్ డివిజన్‌లో 230 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా 39 మందికి పాజిటివ్ వచ్చింది.
వికారాబాద్ జిల్లాలో...
పరిగి / కులకచర్ల : వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం వికారాబాద్‌లో 8, తాండూర్‌లో 7, బొంరాసిసేట్‌లో 4, యాలాల్‌లో 4, కులకచర్లలో 3, పరిగిలో 2, మోమిన్‌పేట్, కొడంగల్, పెద్దేముల్‌లో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మందికి కరోనా పరీక్షలు చేయగా కుస్మసముద్రంలో 1, వీరాపూర్‌లో 1 పాజిటివ్ కేసులు వచ్చాయి.
మేడ్చల్‌లో..
మేడ్చల్ : మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో 90మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా శ్రీరంగవరం పీహెచ్‌సీలో 22మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.