కూలీలు భౌతికదూరం పాటించాలి
ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST
ఉపాధి కూలీలు భౌతికదూరం పాటించాలని సర్పంచ్ అంజనేయులు అన్నారు.

శామీర్‌పేట రూరల్: ఉపాధి కూలీలు భౌతికదూరం పాటించాలని సర్పంచ్ అంజనేయులు అన్నారు. మండల పరిధలోని లక్ష్మాపూర్‌లో సోమవారం ఉపాధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పని కల్పించాలనే ఉద్దేశంతో లాక్‌డౌన్ ఉన్నా పనులను చేయిస్తున్నామన్నారు. కూలీలు భౌతికదూరం పాటించి తమను తాము పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్య క్రమంలో ఎంపీటీసీ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్, కూలీలు పాల్గొన్నారు.