ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి

ABN , First Publish Date - 2020-12-31T05:08:07+05:30 IST

ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి

ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలని వినతి
ఎంపీకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కీసరరూరల్‌ : దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు మల్కా జిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డిని నగరంలోని అయన నివాసంలో బుధవారం కలిశారు. ము న్సిపల్‌ పరిధిలోని రెవె న్యూ సర్వే నంబర్‌ 530/5లోని ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, దానిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎంపీ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వరగంటి వెంకటేష్‌, కౌన్సిలర్లు గోగుల సరిత, పార్టీ అధ్యక్షుడు సురకంటి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ముప్ప రామారావు, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:08:07+05:30 IST