-
-
Home » Telangana » Rangareddy » Congress brought independence to the country
-
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సే..
ABN , First Publish Date - 2020-12-29T04:46:21+05:30 IST
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సే..

పరిగి/నవాబుపేట/కొడంగల్: దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది కాంగ్రె్‌సపార్టీయేనని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రె్‌సపార్టీ అభిర్భావం నుంచి నేటి వరకు పేద ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శులు ఎం.లాల్‌కృష్ణప్రసాద్, కె.హన్మంత్‌ముదిరాజ్, బి.పరుశరాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, కులకచర్ల, పూడూరు మండలాల అధ్యక్షులు బీఎస్ ఆంజనేయులు, సురేందర్, పి.చిన్ననర్సింహులు, ఆంజనేయులు, ఆశ్ర్‌ఫ,రామకృష్ణ, షాహేద్,రియాజ్,.శ్రీనివాస్, మల్లెశ్ తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కొండల్ యాదవ్, వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఇక్బాల్, ఆనందం, నర్సింహారెడ్డి, పాండుగౌడ్, ఉపేందర్‌రెడ్డి, గణపురం ప్రసాద్, గాలయ్య, శివకుమార్, సామ వెంకట్‌రెడ్డి, మహేష్, రత్నం, బాలరాజు, శేఖర్ పాల్గొన్నారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు కేక్‌కట్ చేశారు. కృష్ణంరాజు, నయూం, రాములు, ప్రకాశ్‌రాజ్, జనార్ధన్ మాట్లాడారు. బాల్‌రాజ్, రాములు, తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలి
ఘట్‌కేసర్‌రూరల్/మేడ్చల్ /శామీర్‌పేట/కీసర : కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఘట్‌కేసర్ మండల వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, బీ-బ్లాక్ అధ్యక్షుడు వేముల మహే్‌షగౌడ్ అన్నారు. మండలంలోని ఎదులాబాద్, ఘనాపూర్, అవుశాపూర్, కాచావానిసింగారం తదితర గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సనాన్ని ఘనంగా నిర్వహించారు. ఎదులాబాద్‌లో కర్రె జంగమ్మ, మహే్‌షగౌడ్ కాంగ్రెస్ జెండాను అవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమాలలో ఘనాపూర్ సర్పంచు బద్దం గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ గట్టగల్ల రవి, నాయకులు ఎండీ ఇక్బాల్, మెట్టు నర్సింహ, బాలవెంకటేష్, ఉదయ్‌కుమార్‌రెడ్డి, కృష్ణ, జంగయ్యయాదవ్, రాజిరెడ్డి, ఓంప్రకాష్, బింగి రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం పలువురు వక్తలు కాంగ్రెస్ పార్టీ విజయాలను వివరించారు. హకీంపేటలో గాంధీ విగ్రహం, బస్‌డిపో, పోతాయిపల్లి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద, దేవరయంజాల్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద, తూంకుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తూంకుంటలోని మొగుళ్ల వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాలులో ఆవిర్భావసభ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, మూడుచింతలపల్లి జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, మహే్‌షగౌడ్, జైపాల్‌రెడ్డి, సురేందర్ ముదిరాజ్, భరత్‌సింగ్, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మురళీగౌడ్, అశోక్, హమీద్, హరిగోపాల్, జగదీశ్‌గౌడ్, బాల్‌రాజు, కృష్ణ, యాదగిరి, నర్సింహారెడ్డి, దర్శన్‌గౌడ్, మురళీ గౌడ్, దుర్గేష్, గౌతమ్, రాకేశ్, శశాంక్, లక్ష్మణ్, మహేష్, వెంకటేష్, శ్రీధర్‌గౌడ్, రిషికేశ్, మల్లేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కీసర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మెరుగు ముత్యాలు అధ్వర్యంలో ఆపార్టీ జెండాను ఆవిష్కరిచారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.