రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-29T04:59:32+05:30 IST

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
పనులకు శంకుస్థాపన చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

  • జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితారెడ్డి

కొందుర్గు: టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అన్నారు. సోమవారం తంగళ్లపల్లి, కొందుర్గు గ్రామా ల్లో అభివృద్ధి పనులకు అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ శంకుస్థాపనలు చేశారు. ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలోనూ సంక్షేమాన్ని ముఖ్యమంత్రి ఆపలేదన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేగడి చిల్కమర్రి, తంగళ్లపల్లిలో రూ.ఐదేసి లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు.. కొం దుర్గు, తంగళ్లపల్లిలో సీసీ రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌గణేష్‌, ఎంపీపీ జంగయ్య, జడ్పీటీసీ రాగ మ్మ, వైస్‌ఎంపీపీ రాజే్‌షపటేల్‌, సొసైటీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, బుచ్చమ్మ, ఆదిలక్ష్మి, బాల్‌రాజ్‌, ఎంపీటీసీ రాంరెడ్డి, సయ్యద్‌సాదిక్‌, రామకృష్ణ, రాంచంద్రయ్య పాల్గొన్నారు.


అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల ప్రారంభం

షాద్‌నగర్‌ అర్బన్‌: మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో రూ.11.5లక్షలతో చేపట్టే అండర్‌గ్రౌండ్‌ డైనేజీ పైప్‌లైన్‌ పనులను జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వైస్‌చైర్మన్‌ గణేష్‌, నటరాజ్‌, కౌన్సిలర్‌ శాంతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:59:32+05:30 IST