-
-
Home » Telangana » Rangareddy » complaint against company
-
డ్రగ్ కంపెనీపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-12-20T04:31:55+05:30 IST
డ్రగ్ కంపెనీపై కలెక్టర్‌కు ఫిర్యాదు

శంషాబాద్‌రూరల్: శ్రీ కృష్ణా ఫార్మాసూటికల్స్ కెమికల్ కంపెనీ వల్ల మండల పరిధిలోని పెద్దగోల్కొండలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని దీంతో పంటలు ఎండుతున్నాయని రైతులు శనివారం కలెక్టర్‌కు, పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్)కు ఫిర్యాదు చేశారు. గతంలో అనేకమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పశువులు నీరుతాగి మృత్యువాత పడుతున్నాయని, ఏ పంట వేసినా మొలకెత్తడం లేదని వాపోయారు. కంపెనీని ఇతర ప్రాంతానికి తరలించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఈశ్వరయ్య, బాబయ్య, ముచ్చింతల్ శేఖర్, గడ్డమీది గణేష్, గాజుల నర్సింహ, కుమార్, దేవదాస్, బాలయ్య ఉన్నారు.