ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-10-28T10:14:10+05:30 IST

వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 30 వేలు పరిహారం అందించాలని టీడీపీ చేవెళ్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు సుభాష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలి

పెద్దేముల్‌ : వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 30 వేలు పరిహారం అందించాలని టీడీపీ చేవెళ్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు సుభాష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటనష్టపోయిన రైతులతో మాట్లా డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అన్ని పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర నాయకులు సూరజ్‌సింగ్‌ ఠాకూర్‌, మండలపార్టీ అధ్యక్షులు సుదర్శన్‌రెడ్డి, పార్లమెంట్‌ కార్యదర్శి ఎం .శ్రీనివాస్‌, యాదప్ప, శేఖర్‌యాదవ్‌, పాండునాయక్‌, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T10:14:10+05:30 IST