ఎక్స్‌పో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని తరలించాలి

ABN , First Publish Date - 2020-12-07T04:39:55+05:30 IST

ఎక్స్‌పో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని తరలించాలి

ఎక్స్‌పో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని తరలించాలి
ఏఎ్‌సఐకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కడ్తాల్‌ : ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని ఎక్స్‌ పో ఫ్యాబ్‌ మెటల్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీని అక్కడి నుంచి వెంటనే తరలించాలని ఆదివారం కంపెనీ ఎదుట అన్మా్‌సపల్లి, సాయిరెడ్డిగూడ, జమ్ములబావి తండా ప్రజలు, నాయకులు నిరసన చేపట్టారు. కంపెనీకి ముడిసరుకు తెస్తున్న లారీలను అడ్డుకున్నారు. జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కంబాల పరమేశ్‌ ఆధ్వర్యంలో కంపెనీ వద్ద బైటాయించి ధర్నా చేపట్టారు. కంపెనీలో అధిక తీవ్రతతో జరుగుతున్న పెలుళ్ల వల్ల భారీ శబ్ధాలు, వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీని వేరే చోటకు తరలించే వరకూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని పరమేశ్‌ హెచ్చరించారు. ధర్నా విషయాన్ని తెలుసుకున్న ఏఎ్‌సఐ సీతారామ్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పడంతో అడ్డు తొలిగారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు క్యాతిక కృష్ణయ్య యాదవ్‌, రావుల రాజులగౌడ్‌, వేణుచారి, అశోక్‌, మాదాపురం పెంటయ్య, కంబాల అంజయ్య, శివ, రాజు, రామకృష్ణ, ప్రశాంత్‌, ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:39:55+05:30 IST