‘హరితహారంలో ముందుండాలి’

ABN , First Publish Date - 2020-12-16T05:20:01+05:30 IST

‘హరితహారంలో ముందుండాలి’

‘హరితహారంలో ముందుండాలి’
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌

మేడ్చల్‌ అర్బన్‌: హరితహారంలో జిల్లాను ఈ యేడాది సైతం ముందంజలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పాఠశాలల ఆవరణలో ఎవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాలని చెప్పారు. 2021లో నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు పక్కాప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. 63లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా నర్సరీల్లో ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచాలన్నారు. ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయంతో వ్యవహరించి హరితహారాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శాంసన్‌, డీఆర్డీవో జ్యోతి, డీపీవో పద్మజారాణి, డీఎ్‌ఫవో సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:20:01+05:30 IST