‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచాలి

ABN , First Publish Date - 2020-06-16T10:14:08+05:30 IST

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు 1.16 లక్షల మందికి ఉపాధిహామీ పనులు కల్పించాలని కలెక్టర్‌

‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచాలి

 కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు 1.16 లక్షల మందికి ఉపాధిహామీ పనులు కల్పించాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 57వేల మందికి పనులు కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి తిరిగి స్వస్థలాలకు చేరుకున్న వారికి ఉపాధి పనులు కల్పించాలని కాలువల నిర్మాణం, ఫీడర్‌ చానళ్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కూలీల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-06-16T10:14:08+05:30 IST