పనుల్లో అలసత్వం వహించొద్దు

ABN , First Publish Date - 2020-11-20T04:34:23+05:30 IST

పనుల్లో అలసత్వం వహించొద్దు

పనుల్లో అలసత్వం వహించొద్దు
నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

కలెక్టర్‌ అమయ్‌కుమార్‌  

కడ్తాల, అన్మాస్‌పల్లిలో ఆకస్మిక పర్యటన 

కడ్తాల : అభివృద్ధి పనుల అమలు, ప్రభుత్వ పథకాల లక్ష్యం పూర్తి చేయడంలో అలసత్వం వహించొద్దని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కడ్తాల, అన్మా్‌సపల్లి గ్రామాల్లో గురువారం కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆకస్మికంగా పర్యటించారు. అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, కందుకూరు ఆర్డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డిలతో కలిసి గ్రామంలో పల్లెప్రకృతివనం, రైతువేదిక, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్సరీలను పరిశీలించారు.  పల్లెప్రకృతివనం సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపిన సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డిని కలెక్టర్‌ అభినందించారు. కడ్తాల పల్లెప్రకృతివనాన్ని మండలంలోని ఇతర గ్రామపంచాయతీల సర్పంచులు రోల్‌మోడల్‌గా తీసుకోవాలని సూచించారు. నర్సరీల్లో పదివేల మొక్కలు పెంచుతున్నట్లు సర్పంచ్‌ కలెక్టర్‌కు దృష్టికి తీసుకొచ్చారు. పల్లె ప్రకృతి వనంలో బెంచీలు, నడకదారి అభివృద్ధికి అనుమతులు, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం, ఉపరాచికుంట చెరువు సుందరీకరణ పనుల విషయమై సర్పంచ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ సూచించారు. డంపింగ్‌యార్డులో తడిపొడి చెత్తను వేరుగా వేయాలని పంచాయతీ కార్యదర్శి హరీ్‌షరెడ్డిని ఆదేశించారు. అనంతరం అన్మా్‌సపల్లి గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డులను పరిశీలించారు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడం, మొక్కలు సరిగ్గా లేకపోవడం, డంపింగ్‌ యార్డు పనులు అసంపూర్తిగా ఉండడంతో ఎంపీవో తేజ్‌సింగ్‌, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడో విడత హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌ఐ సురేందర్‌, నాయకులు భిక్షపతి, లాయక్‌అలీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-20T04:34:23+05:30 IST