పేదలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-12-31T04:53:04+05:30 IST

పేదలకు అండగా ఉంటాం

పేదలకు అండగా ఉంటాం
మంచాల : చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

  • ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ  కసిరెడ్డి

మంచాల/కడ్తాల్‌/ఆమనగల్లు/యాచారం : ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా ఉంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధి తిప్పాయిగూడ గ్రామానికి చెందిన బూర విష్ణుకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పి.సుకన్యశేఖర్‌రెడ్డి, గోరె వీరే్‌షగౌడ్‌, మల్లేష్‌, కుమార్‌, విగ్నేష్‌, రాజేష్‌ తదితరులున్నారు. కడ్తాల్‌ మండలంలో బుధవారం ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్‌ విండో ఉప కేంద్రం వద్ద చైర్మన్‌ గంప వెంకటేష్‌,  రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడురు లక్ష్మీనర్సింహారెడ్డి, జడ్పీటీసీ విజితారెడ్డిలతో కలిసి ఏడుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు తులసీరాంనాయక్‌, కృష్ణయ్య, యాదయ్య, సింగిల్‌విండో డైరెక్టర్‌ జోగు వీరయ్య,  నాయకులు లాయక్‌ అలీ, ఈర్షద్‌, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్‌ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, వినోద్‌, నర్సింహ, రాములు యాదవ్‌, జావేద్‌, రాజు, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యాచారం మండల పరిధి నల్లవెల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. మీనమ్మకు రూ.9వేలు, ఆర్‌.దేవేందర్‌కు రూ.22వేలు, ఓంకార్‌కు రూ.60వేలు మంజూరు కగా, చెక్కులను ఎంపీటీసీ లక్ష్మీపతిగౌడ్‌, మాజీ జడ్పీటీసీ కె.రమే్‌షగౌడ్‌, జిల్ల శోభ, ఎండీ ముజామిల్‌, కాంగ్రెస్‌ నాయకులు గులాంఅక్బర్‌, కె.జంగయ్య, తదితరులు అందజేశారు.

Updated Date - 2020-12-31T04:53:04+05:30 IST