సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-28T05:12:59+05:30 IST

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఆమనగల్లు/మంచాల: ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమలులో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందన్నారు. యాసంగి పెట్టుబడి సాయంగా రైతుబంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కడ్తాల, ఆమనగల్లు ఎంపీపీలు కమ్లీ మోత్యనాయక్‌, అనితావిజయ్‌, వైస్‌ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్‌, నాయకులు జిల్లెల్ల రాములు, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన జంగయ్యకు సీఎం రిలీ్‌ఫఫండ్‌ ద్వారా మంజూరైన చెక్కును ఎంపీటీసీ చీరాల రమేష్‌ ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో బహదూర్‌, చిందం రఘుపతి, కందాల శ్రీశైలం, అంతటి రాజు, మార సురేష్‌, ఎండీ.జానీపాషా, రాము, సతీష్‌, సద్దాంహుస్సేన్‌, సూర్యం, శ్రీకాంత్‌, రావుల కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:12:59+05:30 IST