పేదల సంక్షేమమే ప్రభుత్వధ్యేయం

ABN , First Publish Date - 2020-12-06T05:12:15+05:30 IST

పేదల సంక్షేమమే ప్రభుత్వధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వధ్యేయం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి


ఘట్‌కేసర్‌/శామీర్‌పేట: పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌కు చెందిన ముగ్గురికి రూ.73వేలా 500 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సపొందిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌ నాయకులు జహంగీర్‌ కృష్ణారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింగ్‌ రావు, సలీం పాల్గొన్నారు. అదేవిధంగా శామీర్‌పేట మండలం అలియబాద్‌ గ్రామానికి చెందిన ఎం.వర్షితకు రూ45 వేలు, భూషణంకు రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు తాళ్ళ జగదీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:12:15+05:30 IST