పేదలకు వరం సీఎం సహాయనిధి

ABN , First Publish Date - 2020-03-18T05:30:00+05:30 IST

పేదలకు వరం సీఎం సహాయనిధి అని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు చెందిన అనిల్‌కు రూ.19 వేలు, చంద్రాయన్‌పల్లి తండాకు చెందిన దోళికి

పేదలకు వరం సీఎం సహాయనిధి

ఆమనగల్లు: పేదలకు వరం సీఎం సహాయనిధి అని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని మేడిగడ్డ తండాకు చెందిన అనిల్‌కు రూ.19 వేలు, చంద్రాయన్‌పల్లి తండాకు చెందిన దోళికి రూ.60వేలు, వెల్దండ మండలం బైరాపూర్‌కు చెందిన భారతమ్మకు రూ.12,500లు, చారగొండ మండలం జూపల్లికి చెందిన వెంకటయ్య రూ.20వేలు సీఎం సహయనిధి నుంచి మంజూరయ్యాయి. బుధవారం హైద్రాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం సహయనిధి పేదలకు వరంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితవిజయ్‌, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, నాయకులు జైపాల్‌ నాయక్‌, జైపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, పవన్‌కుమార్‌ రెడ్డి, రాజవర్దన్‌ రెడ్డి, మల్లేశ్‌నాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండలం అంతారంకు చెందిన శిరీషకు రూ.2లక్షలు సీఎం సహయనిధి నుంచి మంజూరయ్యాయి. బుధవారం వెల్జాల్‌ గ్రామంలో బాధిత కుటుంబానికి మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు రహెమాన్‌ చెక్కును అందజేశారు.

Updated Date - 2020-03-18T05:30:00+05:30 IST