సీఎం దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి

ABN , First Publish Date - 2020-12-27T05:24:24+05:30 IST

సీఎం దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి

సీఎం దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి

 పెళ్లి కూతురిని చేసిన జిల్లా స్ర్తీ, శిశుసంక్షేమ శాఖ అధికారులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): సీఎం కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి సందడి మొదలైంది. ఈనెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేటమండలం పాటిగడ్డగ్రామం లూర్ధుమాత చర్చిలో ఉదయం 10 గంటలకు పెళ్లి జరగనుంది. వైభవోపేతంగా వివాహాన్ని జరిపించడానికి మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం స్ర్తీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాఅధికారులు ప్రత్యూషను పెళ్లి కూతురిని చేశారు. బేగంపేటలోని ఐఏఎస్‌ అతిథి గృహంలో మెహిందీ కార్యక్రమన్ని నిర్వహించారు. జేడీలు లక్ష్మీదేవి, సునంద, ఆర్జేడీ శారద, డిప్యూటీ డైరెక్టర్లు గిరిజ, మోతీ, నూర్జాహాన్‌, లక్ష్మీబాయి, హర్షవర్ధిని, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:24:24+05:30 IST