-
-
Home » Telangana » Rangareddy » CITU donations collection for former
-
ఢిల్లీ రైతుల కోసం విరాళాల సేకరణ
ABN , First Publish Date - 2020-12-20T04:36:49+05:30 IST
ఢిల్లీ రైతుల కోసం విరాళాల సేకరణ

ఘట్‌కేసర్: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఘట్‌కేసర్‌లో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు ఎన్.సబిత మాట్లాడుతూ పెట్టుబడిదారుల కోసం రైతుల పొట్టకొట్టడానికి కేంద్రప్రభుత్వం కొత్త సాగుచట్టాలను తీసుకువచ్చిందన్నారు. దేశంలోని మొత్తం రైతాంగం కొత్తచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా రూ.4వేలా 627 విరాళాలు సేకరించామన్నారు. ఈమొత్తాన్ని జిల్లా కమిటీకి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నర్సింహా, బిక్షపతి, చంద్రమౌళి, జంగయ్య, బాలయ్య, రాజయ్య, చంద్రమోహన్, దేవయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.