ధారూరు సీఐ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-22T04:23:14+05:30 IST

పోలీసు ఉన్నతాధికారిపై దురుసుగా వ్యవహరించారనే అభియోగంపై ధారూరు సీఐ మురళిని సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ధారూరు సీఐ సస్పెన్షన్‌

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : పోలీసు ఉన్నతాధికారిపై దురుసుగా వ్యవహరించారనే అభియోగంపై ధారూరు సీఐ మురళిని సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కోట్‌పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్న యువతి హత్యోదంతానికి సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయమై జిల్లా ఎస్పీ తన కార్యాలయానికి ధారూరు సీఐని పిలిపించి ప్రశ్నించారు. అయితే ఆ హత్య కేసులో నిందితులను పట్టుకునే విషయంలో ఆలస్యం జరగడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ వ్యవహరించిన తీరును పోలీసు ఉన్నతాధికారులకు వివరించి నివేదిక పంపించారు. ధారూరు ఇన్‌స్పెక్టర్‌ వ్యవహరించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందంటూ క్రమశిక్షణా చర్యల కింద మురళిని సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Read more