-
-
Home » Telangana » Rangareddy » CHILIKURU TEMPLE CLOSED TILL MARCH 31
-
31వ వరకు చిలుకూరు ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2020-03-24T08:29:10+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భా గంగా ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించడంతో చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 31 వరకు మూసివేస్తున్నట్టు...

మొయినాబాద్ రూరల్: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భా గంగా ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించడంతో చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 31 వరకు మూసివేస్తున్న ట్టు ఆలయం మేనిజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, అర్చకులు గోపాలకృష్ణ, సీఎస్ రంగరాజన్ తెలిపారు. సోమవారం వారు మా ట్లాడుతూ.. కోవిడ్19పై విజయం కోసం బాలాజీ స్వామివారికి అపమర్జన స్తోత్ర పఠనం, సుదర్శనష్టక, విష్ణుసాహస్రనామ పరాయణ మంత్రాలను రోజూ ఆలపిస్తున్నామన్నారు. కరోనా నివారణ కు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సూచనలు పాటించాల్సిన బా ధ్యత మనందరిపై ఉందన్నారు. 25వ తేదీ ఉగాది రోజున స్వామివారి కోసం అర్చకులు ప్రైవేటుగా పంచాంగ శ్రవణం నిర్వహించి భక్తులకు మీడియా ద్వారా తెలియజేస్తామన్నారు.