టీవీలు విద్యార్థులకు ఉపయోగపడాలి

ABN , First Publish Date - 2020-09-13T09:06:51+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల కోసం గ్రామ పంచాయతీలకు ఉచితంగా అందిస్తున్న టీవీలను ..

టీవీలు విద్యార్థులకు ఉపయోగపడాలి

చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి

5 మండలాల్లో ఉచితంగా టీవీల పంపిణీ


దోమ/మోమిన్‌పేట/బంట్వారం/కోట్‌పల్లి/మర్పల్లి : కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల కోసం గ్రామ పంచాయతీలకు ఉచితంగా అందిస్తున్న టీవీలను విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై  ఉందని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు. శనివారం దోమ మం డల పరిషత్‌ కార్యాలయంలో 36 గ్రామ పంచాయతీలకు ఎంపీ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన టీవీలను పంపీణీ చేశారు. అదే విధంగా నూతన రెవెన్యూ చట్టం అమలుకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి వారు  క్షీరాభిషేకం చేశారు.


ఈ కార్యక్రమంలో డీఈవో రేణుక, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, వైస్‌ ఎంపీపీ జి.మల్లేశం, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. మోమిన్‌పేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి మండలంలోని 28 గ్రామపంచాయతీలకు టీవీలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవోతోపాటు ఎంపీపీ వసంతవెంకట్‌, జడ్పీవై్‌సచైర ్మన్‌ విజయ్‌కుమార్‌, నాయకులు నర్సింహారెడ్డి, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, విఠల్‌, మానస, శ్రీనివా్‌సరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని 8 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆనంద్‌ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.


బంట్వారం మండల పరిధిలోని 11 గ్రామపంచాయతీలకు, కోట్‌పల్లి మండల మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు ఆయా మండల కేంద్రాల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి టీవీ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌ సుధాకర్‌గౌడ్‌, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, ఖాజాపాషా, అనిల్‌కుమార్‌, వెంకటే్‌షయాదవ్‌ పాల్గొన్నారు. మర్పల్లి మండలంలోని 27 గ్రామపంచాయతీలకు 27 టీవీలను ఎంపీ రంజిత్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లలితారమేష్‌, జడ్పీటీసీ మధుకర్‌, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-13T09:06:51+05:30 IST