పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-14T05:18:35+05:30 IST

పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం

పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

  • ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి

ఆమనగల్లు : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం నగరంలోని తన నివాసంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అందజేశారు. గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడరు లక్ష్మీనర్సింహా రెడ్డి, టీఆర్‌ఎస్‌ తలకొండపల్లి మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, వజ్రం, జయప్రకాశ్‌, శివరాజ్‌, శ్రీశైలం, రాజు, సుభాష్‌, ప్రసాద్‌, స్కైలాబ్‌, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి, కడ్తాల్‌, మాడ్గుల, ఆమనగల్లు మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం నగరంలోని తన నివాసంలో అందజేశారు. మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు కసిరెడ్డి నారాయణ రెడ్డిని కలిసి ఆయనతో పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, సురేందర్‌ రెడ్డి, వెంకటయ్య, బాబా, రవిరాథోడ్‌ , వినయ్‌, నబీ, మన్యం, కిరణ్‌, రాంబాబు, చంటి, విజయ్‌, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.


శివయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే

కడ్తాల్‌ : ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడ్తాల మండల కేంద్రానికిచెందిన సూద శివయ్యను ఆదివారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి లు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట వెంకటయ్యగౌడ్‌, రాజు, సుభా్‌ష, తదితరులున్నారు.

Updated Date - 2020-12-14T05:18:35+05:30 IST