మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-12T04:54:54+05:30 IST

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఆడబిడ్డలు తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డిలతో కలిసి 12 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా నిలుస్తోందన్నారు. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ జోగు వీరయ్య, నాయకులు లాలయ్యగౌడ్‌, జంగయ్య పాల్గొన్నారు. 


వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ


ఆమనగల్లు : ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూతురు వివాహ వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొన్నారు. హైదరాబాద్‌ నాగోల్‌ పీఎమ్‌ఆర్‌ గార్డెన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, తదితరులున్నారు. 

Updated Date - 2020-12-12T04:54:54+05:30 IST