-
-
Home » Telangana » Rangareddy » central committee members
-
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-20T04:53:14+05:30 IST
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నిర్మించిన మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని

- స్వచ్ఛభారత్ మిషన్ కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్ భినీశమాల్
చేవెళ్ల : స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నిర్మించిన మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆ మిషన్ కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్, భినీశమాల్ తెలి పారు. శనివారం చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, తంగడ్‌పల్లి, ఆలూర్ తదితర గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులతోపాటు డంపింగ్ యార్డులు, మరుగుదొడ్ల నిర్మాణాలను బృందం సభ్యులు పరిశీలించారు. గ్రామాల్లో చెత్తను ఎలా సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను ఎలా వేరు చేస్తున్నారు..?, అదేవిధంగా డంపింగ్ యార్డుల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్‌డీవో పీడీ ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీడీవో హరీశ్‌కుమార్ వివరించారు. అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. గ్రామాల్లో అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణా లను పూర్తి చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో శ్రీకాంత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీవో విఠలేశ్వర్, ఏపీవో నాన్సీ, ఈసీ రాజశేఖర్, ఎస్‌బీఎంలు శ్రావ్య, రోస్, శ్రీధర్, సర్పంచ్‌లు శేరి స్వర్ణలతదర్శన్, విజయలక్ష్మినర్సింహులు, గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.