-
-
Home » Telangana » Rangareddy » cci leave
-
సీసీఐ కేంద్రానికి సెలవు
ABN , First Publish Date - 2020-11-28T05:21:27+05:30 IST
సీసీఐ కేంద్రానికి సెలవు

చేవెళ్ల: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన రైతులు ఎవ్వరూ పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకరావొద్దని చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎం.శివలీల శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. సీసీఐ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీనివాస కాటన్ ఇండస్ర్టీస్ దామరిగిద్ద వద్ద పత్తిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తుఫాను వాతావరణం కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రానికి 27 నుంచి 30వ తేదీ మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరిగి పత్తిని రైతులు డిసెంబర్ 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రానికి తీసుకరావాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకూడదని ముందస్తుగానే సమచారం ఇస్తున్నామని, దీనికి వారు సహకరించాలని ఆమె కోరారు.