-
-
Home » Telangana » Rangareddy » cc cemeras
-
సీసీ కెమెరాలతో నేరాల అదుపు
ABN , First Publish Date - 2020-11-22T05:13:54+05:30 IST
సీసీ కెమెరాలతో నేరాల అదుపు

షాద్‌నగర్ ఏసీపీ సురేందర్
షాద్‌నగర్: సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలా వరకు నేరాలను అదుపు చేయవచ్చని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ అన్నారు. పట్టణంలోని చటాన్‌పల్లి రోడ్డులో ఏర్పాటు చేసేందుకు దాతలు ఇచ్చిన 11సీసీ కెమెరాలను శనివారం బిగించి వాటిని పోలీ్‌సస్టేషన్‌కు అనుసంధానం చేసిన అ నంతరం మానిటర్‌ను ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్‌నగర్ రోజురోజుకూ వి స్తరిస్తోందన్నారు. 62కాలనీలు ఉన్న పట్టణంలో 10వేల సీసీ కెమెరాల అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రజలు పలు కాలనీల్లో 500 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారని, పోలీసులు సైతం 200 కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంకా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ము న్సిపల్ నిధులు మంజూరు చే యించాలని కోరుతూ ఎమ్మెల్యేను, మున్సిపల్ చైర్మన్‌ను కో రామని గుర్తుచేశారు. ఈ మేర కు వారు సుమారు 40లక్షల రూపాయల మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇంటికో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులు, దొంగతనాలను అదుపు చేయడానికి తాము కృషిచేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కుమార్, క్రైమ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఎస్సై విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.