అన్ని కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-11-26T05:10:10+05:30 IST

అన్ని కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు

అన్ని కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు

కడ్తాల్‌ : మండల కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు, కడ్తాల సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసు శాఖ, పంచాయతీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుదవారం సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థలాలు, కూడళ్లను ఆయన పరిశీలించారు. హనుమాన్‌ ఘాట్‌, చల్లంపల్లి, మాదారం చౌరస్తా, కొండ్రిగాని బోడు తండా రోడ్లలో, ఆలయాలు, మజీదులు, ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మండల కేంద్రాన్ని నిఘా నేత్రం పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు వివరించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎస్‌ఐ సుందరయ్యను ఆయన అభినందించారు. కార్యక్రమంలో లాయక్‌అలీ, అశోక్‌, రాఘవాచారి, పోలీసు సిబ్బంది వసురామ్‌, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more