పిచికారి చేస్తున్న సిబ్బందికట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2020-03-30T11:29:16+05:30 IST

కరోనా వైరస్‌ అను మానిత కేసులు పెరిగి పోతున్నాయి. అధికంగా నమో దవుతున్న ఐదు జిల్లాల్లో.. మేడ్చల్‌ జిల్లా ఒకటి. జిల్లాలో ఒకే రోజు.. ఒకే కుటుంబంలో ఐదు గురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది.

పిచికారి చేస్తున్న సిబ్బందికట్టడికి చర్యలు

మేడ్చల్‌ జిల్లాలో అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు 

తిమ్మాయిపల్లిలో క్రిమిసంహారక ద్రావణాన్ని 

పిచికారి చేస్తున్న సిబ్బందిల


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లాప్రతినిధి) : కరోనా వైరస్‌ అను మానిత కేసులు పెరిగి పోతున్నాయి. అధికంగా నమో దవుతున్న ఐదు జిల్లాల్లో.. మేడ్చల్‌ జిల్లా ఒకటి. జిల్లాలో ఒకే రోజు.. ఒకే కుటుంబంలో ఐదు గురికి  కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేసేం దుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. జిల్లా పరిశ్రమ లకు నిలయం.. పలు జాతీయస్థాయి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాకు విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విధంగా వచ్చేవారితోనే వ్యాధి వ్యాప్తి చెందుతోంది. వీరిపై నిఘా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. వీరంతా ఎవరెవరిని కలిశారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. జిల్లాలోని కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌ మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో అనుమానిత కేసులను క్వారంటైన్‌ చేయడంతోపాటు స్ర్కీనింగ్‌, వైద్య, సదుపాయాలను మరింత పెం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు ఫోర్సును కూడా మరింత పెంచి ఎవరూ బయటకు రాకుండా  కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా..

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీధులు, రహదారులపై వైరస్‌ను నశింపజేసే సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని జీహెచ్‌ఎంసీతోపాటు 4 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు, 61 గ్రామపంచాయతీలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా స్వీయనిర్బంధం పాటిస్తున్నారు. నిత్యావసర సరుకులు మాత్రమే బయటకు వస్తున్నారు. మార్కెట్లు, దుకాణాల వద్దకు వచ్చే వారు కచిత్చంగా మాస్కులు ధరిస్తున్నారు.  


పట్టణాలు, పల్లెల్లో సామాజికదూరం 

పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద ముగ్గులతో డబ్బాలను ఏర్పాటుచేశారు. ఒకరి ద్వారా ఒకరు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు కూడా పర్యటించి ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నారు. అం దరూ విధిగా మాస్కులు ధరించాలని కూడా తెలియ జేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సంచార రైతు బజార్లు సేవలను అందుబాటులోకి తెస్తు న్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే కూర గాయాలు విక్రయించాలని చర్యలు తీసుకుం టున్నారు.

Updated Date - 2020-03-30T11:29:16+05:30 IST